భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 11 ( జనం న్యూస్)
బుధవారం నిర్మల్ న్యాయస్థానం పరిధిలో అడ్వకేట్ పి. అనిల్ కుమార్ వృత్తి పరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు అడ్డంకులు కలిగించడం అత్యంత తీవ్రమైన, చట్ట విరుద్ధమైన చర్యగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సంఘటన న్యాయవాదుల గౌరవం, వృత్తి స్వాతంత్ర్యంపై ప్రత్యక్ష దాడి వంటిదిగా మేము భావిస్తున్నాము. కోర్టు ప్రాంగణంలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం న్యాయ వ్యవస్థకు అవమానం.అందువల్ల న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, న్యాయవాదుల ఐక్యతను బలోపేతం చేయడానికి, మరియు బాధిత న్యాయవాది సహోదరునికి మానసిక మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులైన పోలీసు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.మేము రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ గారిని కోరుతున్నాము
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలి.న్యాయవాదుల వృత్తి స్వాతంత్ర్యాన్ని కాపాడేలా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలి.కోర్టు ప్రాంగణాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలి.న్యాయవాదుల గౌరవం అనేది న్యాయ వ్యవస్థ యొక్క బలం.పోలీసులు హూలిగన్ల వలె ప్రవర్తించడం క్షమించరాని చర్య.ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ తరఫున
అధ్యక్షుడు: లక్కినేని సత్యనారాయణ ఉపాధ్యక్షుడు: గోపికృష్ణ ప్రధాన కార్యదర్శి: భాగం మాధవ్ రావు
కార్యవర్గ సభ్యులు: కాసాని రమేష్, ఉప్పు అరుణ్, మాలోత్ ప్రసాద్, కే. చిన్నకృష్ణ, అడపాల పార్వతి, .
ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, సమస్త న్యాయవాదులను ఐక్యంగా నిలబడమని కోరుతున్నారు


