Listen to this article

జనం న్యూస్ నవంబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన,

కాట్రేనికోన మండల తెలుగు యువత అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన వంగ దుర్గ బాబు పని మొదలు పెట్టారు. పార్టీలో ఏ పదవి లేనప్పుడు ఆ పార్టీ అభివృద్ధి కోసం తన సొంత పనులను సైతం పక్కనపెట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పవన్ లు దుర్గ బాబు సేవలకు పెద్దపీట వేశారు. మండలంలోని యువతను ఆకర్షించడంతోపాటు ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలో సూచనలు చేస్తున్నాడు. మండలంలోని పార్టీ సీనియర్ల సలహాలు మేరకు నడుచుకుంటూనే తనదైన శైలిలో రాబోయే స్థానిక ఎన్నికల్లో టిడిపి సత్తా చాటేందుకు అవసరమైన మేరా దుర్గ బాబు ప్రయత్నం చేస్తున్నాడు.