Listen to this article

మద్నూర్ నవంబరు 15 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామం…గత మూడు రోజులుగా ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
శ్రీ వీరభద్ర స్వామి వార్షిక మహోత్సవాలు అన్నీ కార్యక్రమాలు, అన్నీ ఆచారాలు, అన్నీ సంప్రదాయాలు అద్భుత భక్తి భావంతో నిర్వహించబడ్డాయి.మొదటి రోజు నుంచి ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది.పసుపు పూయడం, పందిరి వేయడం… భక్తి రాగాలతో గ్రామం మొత్తం గంభీరంగా మారింది.రెండవ రోజు, భజన బృందాల గాత్రం ఆలయ వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చగా,
కన్యానోత్సవం మరియు అన్నదాన కార్యక్రమాల్లో వందలాది భక్తులు పాల్గొన్నారు.ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తి ముఖంలో ఆనందం, భక్తి, తృప్తి స్పష్టంగా కనిపించింది.మూడవ రోజు, మహోత్సవాల ప్రధాన ఆకర్షణ — అగ్నిగుండం.శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ పుణ్యకార్యంలో పాల్గొన్న భక్తులు “అగ్నిగుండం తిలకిస్తే కోరికలు నెరవేరతాయి” అన్న విశ్వాసంతో స్వామివారిని స్మరించారు.అనంతరం పల్లకి సేవ అద్భుతంగా కొనసాగింది.మద్నూర్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడం…
ఈ మహోత్సవాల పట్ల ప్రజల్లో ఉన్న భక్తి, అనుబంధం, విశ్వాసానికి నిదర్శనం.ఆలయ పూజారి వంశపారంపరగా నిర్వహిస్తున్న ఈ వార్షిక ఉత్సవాలు సాంప్రదాయం ఎలా నిలిచిపోతుందో…
ఆచారం ఎలా కొనసాగుతుందో…భక్తి ఎలా తరతరాలకు చేరుతుందో మరొక్కసారి మద్నూర్ నిరూపించింది.