Listen to this article

బిచ్కుంద నవంబర్ 15 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద లో పిజి కోర్సులు ఎంఎ,తెలుగు, ఎం ఎ ఇంగ్లీష్, ఎo. కం కోర్సు లలో అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. అశోక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ లో కనీస 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని కళాశాల పీజి కోఆర్డినేటర్ టి. సంతోష్ తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ ఓర్జినల్ సర్టిఫికెట్ తో పాటు 2100 ప్రాసెసింగ్ ఫీ తీసుకు రాగలరు.చివరి తేదీ 18- 11- 2025 ఇట్టి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని సూచించారు