జనం న్యూస్, నవంబర్ 15,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్,హోం మంత్రి వంగలపూడి అనిత,కొల్లురవింద్ర,అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శించారు.మంత్రులకు,ఎంపీకి,ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కి కంపెనీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.బ్రాండెక్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు.
