Listen to this article

జనం న్యూస్ నవంబర్ 15, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :

పట్టణంలో ఈ రోజు ఐక్యూ మైండ్ సంస్థలో వివిధ కోర్సుల్లో శిక్షణ మీరు తప్పక పొందిన విద్యార్థులకు కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సర్టిఫికెట్లు అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి అని, విద్యార్థులు తమ ప్రతిభను మరింత బలపరుచుకొని పెద్ద లక్ష్యాలను చేరుకోవాలని, కుటుంబ మరియు సమాజం అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.కష్టపడి పనిచేయడమే విజయానికి మూలమంత్రమని యువతకు సందేశం ఇచ్చారు, భవిష్యత్తు కోసం ప్రతిభ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్న ఐక్యూ మైండ్స్ విద్యార్థులందరికీ ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఐక్యూ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు