Listen to this article

బీజేపీ నేత డా. ఏలూరి సంతోషం.

జనం న్యూస్ నవంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భారీ అవకాశాల్ని తీసుకొస్తోందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డా. ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన తొలి రోజు సదస్సులోనే ఏపీకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు చేరటం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. మొత్తం 400 ఎంవోయూలు కుదిరి, రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఎంతో హర్షనీయమన్నారు. వీటి ద్వారా 13,32,445 కొత్త ఉద్యోగాలు సృష్టించబోతుండటం రాష్ట్ర యువతకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన కార్యక్రమంలోనే 41 ఎంవోయూలు, వాటి ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు మరియు 4.16 లక్షల ఉద్యోగాలు నమోదుకావడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు.. మంత్రుల సమక్షంలో మరో 324 ఎంవోయూలు కుదిరి, వాటి ద్వారా రూ. 8,41,786 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి చేరుతుండటం విశేషం అన్నారు.. అలాగే రెండో రోజు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఎంతో కృషి చేశారని.. ముఖ్యంగా కేంద్రమంత్రులను రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పెంచారని కొనియాడారు.. వారిద్వారా ఈ కార్యక్రమం మహా గొప్పగా విజయవంతం అయిందని అన్నారు.. మాధవ్ గారు మొదటి నుంచి కూడా ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు.. ముఖ్యంగా కేంద్ర సంస్థలు ఎన్నో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఏలూరి.. ఇందులో మాధవ్ గారి పాత్ర కీలకం అని తెలిపారు.. డా. ఏలూరి ఇంకా మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, రాష్ట్రానికి దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం, క్రమబద్ధతతో ముందుకు నడిపిస్తున్న నారా లోకేష్ పాత్ర.. ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమల కేంద్రంగా మలచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు మంత్రి నారా లోకేష్ , టీజీ భరత్ లకు అభినందనలు తెలిపారు ఏలూరి.