గోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం
గాయలతో బయటపడ్డ మరో వ్యక్తి
( పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం రాయికల్ పరిధిలోని జిఎంఆర్ టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా పరిధిలోని బూరుగడ్డ తండా కు చెందిన మూడవత్ గోపాల్ నాయక్ తండ్రి హరియా అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలకు బయటపడ్డాడు. షాద్నగర్ నుండి స్వగ్రామానికి వస్తుండగా తమిళనాడుకు చెందిన కంటైనర్ వాహనం టిఎన్ 86 సి 9838 నంబర్ గల వాహనం ఢీకొట్టడం జరిగింది.
