జనం న్యూస్ 17.11.2025 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బీసీ కాలనీలో విస్తృత స్థాయి సమావేశం కుమ్మరి సంఘం అధ్యక్షులు గంగాధరీ సుదీర్ కుమార్ అధ్యక్షుతన ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏండ్లుగా కుమ్మరులు అభివృద్ధికి ఆమడ దూరంల నిలిచారన్నారు. కుమ్మరులు కలిసి కట్టుగా ఉండి పోరాడితే తప్పా మన హక్కులను సాధించలేమన్నారు. కుమ్మరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కారించాలంటే ముందుగా అందరూ ఒక్కతాటిపై ఉండాలన్నారు. సొంతంగా చేయలేని పనులు సంఘంగా ఏర్పడటం వల్ల చేయవచ్చన్నారు. కుండలు చేసే అధునాతన పరికరాలు ప్రభుత్వ సబ్సిడీతో పొందడం మన హక్కు అన్నారు. కుమ్మరులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి, హక్కుల్ని దక్కించుకోవడానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జివిలికపల్లి సత్యనారాయణ,అసోసియేట్ అధ్యక్షుడు కోరుటూరి బాలరాజు,మీడియా విభాగం కోరుటూరు ఉపేందర్,రాజకీయ విభాగం కోరుటూరు సతీష్, మండల ఉపాధ్యక్షుడు శనిగరం హరీష్,కొరుటూరీ నరసింహులు,గంగాధరి ఇస్తారి,గంగాధరి సాయికిరణ్ ,గంగాధరి సత్తయ్య,సాయి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధరీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.


