జనం న్యూస్ 17 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు పురస్కరించుకుని మరియుజాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ది ఫోర్ట్ సిటీ స్కూల్ ( సి.బి.ఎస్.ఈ) విభాగం నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని “చి” పి. మోక్ష కు ఉత్తమ ప్రతిభా పురస్కారం అందచేయడం జరిగింది.ఈ సందర్బంగా చి ” మోక్షకు ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం, జిల్లా గ్రంధాలయ సంఘం,జిల్లా పౌరవేదిక,జిల్లా రచియితల సంఘం,వాకర్స్ క్లబ్బులు, మరియు పలు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


