Listen to this article

జనం న్యూస్‌ 17 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం గురజాడ గ్రంథాలయంలో జిల్లాలో 15 పాఠశాలలకు చెందిన 300 మంది ఉత్తమ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ప్రధానం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు వారానికి ఒక్కసారైనా గ్రంథాలయానికి వెళ్లి అభ్యసించడం అలవాటు చేసుకోవాలన్నారు.