జనం న్యూస్ 17 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెయిట్రిఫ్టర్ టీ. సత్యజ్యోతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 89 కిలోల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. దీంతో అప్పట్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ ప్రశంసలు కూడా అందుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్‌కు ఎంపికైన సత్యజ్యోతి మరి కొద్ది రోజుల్లోనే విధుల్లో చేరాల్సి ఉంది.


