Listen to this article

నవంబర్ 16: సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్

ఉత్పన్త్ప ఏకాదశిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణం లోని హనుమాన్ మందిరం లో శనివారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు. హరేకృష్ణ మూమెంట్, ఏకాదశి భజన మండలి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం లో శ్రీ కృష్ణ కీర్తనలు, శ్రీ రామ భజనలు, శ్రీ శివ స్తోత్రాలు ఆలపించారు. రస రమ్యకరంగా ఆలపించిన పాటలు ఆహుతులను ఆకట్టుకొన్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి ప్రారంభ ఏకాదశిగా భావిస్తారు. ఈ కార్యక్రమం లో శ్యామ్ సుందర్ ఝవర్, రామ్ రతన్ సారదా, సూదాం వెంకట్, భార్గవ్ జాజు, ఓం ప్రకాష్ పల్లోడ్,పవన్ జాజు, ఘన శ్యామ్ జాజు, ఆనంద్ సారదా, ఎన్నం రఘు తదితరులు పాల్గొన్నారు.