

జనం న్యూస్ ఫిబ్రవరి 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో గల మహాలక్ష్మి శక్తిపీఠం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టుముక్కుల గ్రామానికి చెందిన మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ దైవదర్శనం లో భాగంగా మహారాష్ట్రలోని మహా లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం నాలుగు రోజులపాటు తీర్థయాత్రల ప్రయాణం కొనసాగించినట్లు వారు తెలిపారు. పూజలో పాల్గొన్న సభ్యులు ధర్పల్లి సంజీవరెడ్డి, నత్తి సంజీవ్, ధర్పల్లి జైపాల్ రెడ్డి, కర్రోళ్ల అంజాగౌడ్, పెద్ద మడ్తల రాజు, శివశంకర్, దీటి రాజు పాల్గొన్నారు.