Listen to this article

జనం న్యూస్ నవంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి : గ్రంధి నానాజీ

ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైసాఛాన్సలర్ సాతుపాటి ప్రసన్నశ్రీ రామోజీ ఎక్సలెన్సీ అవార్డు పొందడం హర్షణీయమని బిజెపి నాయకులు, సెయిల్ మాజీ సభ్యులు నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. కళలు, సంస్కృతి రంగంలో ఆమె ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. గిరిజన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దశాబ్దాలుగా ఆమె క్రృషి చేసారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని కొండదొర, కోయ, సవర, సుగాలి వంటి గిరిజన జాతుల జీవనశైలిని సమగ్రంగా అధ్యయనం చేసారని వీరన్నచౌదరి వెల్లడించారు. అంతేగాకుండా కళలు, సంస్కృతి అంశాలతో పాటుగా సుమారు 19 గిరిజన భాషలకు సాతుపాటి ప్రసన్నశ్రీ వర్ణమాల రూపొందించారన్నారు. ఆదివాసీలకు సంబంధించిన అరుదైన సమాచారాన్ని లిఖిత రూపంలో నిక్షిప్తం చేసి భావితరాలకు అందించే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారని వీరన్నచౌదరి పేర్కొన్నారు.