Listen to this article

జనం న్యూస్‌ 19 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.