జనం న్యూస్, నవంబర్ 19, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
మండలంలో గల జాగ్గాసాగర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల వైద్యాధికారి డాక్టర్ తాటిపర్తి శివాని ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల నుండి జిల్లా బాలల పరి రక్షణ విభాగం నుండి చైల్డ్ లైన్ 1098 అధికారి కేసు వర్కర్ రజిత కార్యాలయంలో గ్రామ ప్రజలకు మరియు గ్రామ పెద్దలకి మరియు స్కూల్ లోని పిల్లలకు బాలవివాహంపై అవగాహన కల్పించడం జరిగింది. స్కూల్లో పిల్లలకి బాల్య వివాహ చట్టం- 2006, పోక్సో చట్టం -2012,మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు పై అవగాహన కల్పించడం జరిగింది.బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు అమ్మాయికి 21 సంవత్సరంలోపు అబ్బాయికి వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడునని అదేవిధంగా బాల్యవివాహాల వల్ల పిల్లలకు భవిష్యత్తులో మానసిక శారీరక ఎదుగుదల ఆగిపోతుందని అలాగే ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రోత్సాహాలు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలు వర్తించవని,గ్రామపంచాయతీ పరిధిలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి పిల్లల సమస్యలను గురించి చర్చించి పిల్లలకు సమస్య ఉంటే ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. మరియు బాలబాలికలు మత్తు కి బానిస అవ్వడం మరియు మొబైల్ ఫోన్స్ కి దూరంగా ఉండాలని అలాగే 18 సంవత్సరాల లోపు బాలబాలికలకి రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల కొరకు 24 గంటలు పనిచేసే ఉచిత అత్యవసర ఫోన్ సేవా సౌకర్యం చైల్డ్ హెల్ప్ లైన్1098 పోలీస్ 100, సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాల్య వివాహాలు లేని భారతదేశ కోసం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసీడీస్ సూపర్వేజర్స్ హేమలత , జిల్లా పరిషత్ స్కూల్ హెడ్మాస్టర్ ప్రభాకర్ , గ్రామ సెక్రటరీ ప్రశాంత్, హెల్త్ సూపర్వైజర్ మహేశ్వరి,ఏఎన్ఎం లావణ్య, అంగన్వాడీ టీచర్స్ పూలమ్మ గారు, శారద ఆశవర్క్స్, VO మహిళలు గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.


