కల్లు తనిఖీ లో ఎటువంటి కల్తీ లేదని నిర్ధారణ..
జనం న్యూస్ 19 నవంబర్
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఎక్సైజ్ పార్టీ అధికారుల ఆధ్వర్యంలో తాటి ఈత కల్లు తనిఖీ చేశారు. మండలంలోని కొల్వాయి గ్రామంలో కల్లు మండవల లో కల్లు షాంపిల్స్ సేకరించి ప్రయోగాత్మకంగా తనిఖీ చేసి పరీక్షించరు. తనిఖీలలో ఎలాంటి మత్తు పదార్థాలు కల్లులో కలవలేదని నిర్ధారించారు. ఎక్సైజ్ అధికారులు కల్లు తనికి తర్వాత నిర్ధారణ చేస్తూ ఆరోగ్యానికి హాని చేసే మత్తు పదార్థాలను వినియోగించకుండా నిరంతరం నిగా ఉంచి తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు. కోల్వాయి గౌడ సంఘం అధ్యక్షులు రామచంద్రం గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీ బృందంతో పాటు అన్ని కల్లు మండవలు సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు రామచంద్రం మాట్లాడుతూ మండలంలో కోల్వయి గ్రామంలో ఎటువంటి కల్తీ లేని శుద్ధమైన కళ్ళును గౌడ సంఘం సభ్యులు ద్వారా సేకరిస్తున్నామని, ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని మత్తుపదార్థాలకు బానిస కాకుండా శుద్ధమైన ఆరోగ్యాన్ని కలగజేసే ఈతకల్లు తాటికల్లు, సేవించడం మంచిదని ఈరోజు ఎక్సైజ్ పార్టీ తనిఖీ ద్వారా తమ గ్రామంలో శుద్ధమైన ఎటువంటి కల్తీ లేని కల్లు అందిస్తున్నట్టు నిర్ధారణ జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఏ మజీద్ ఎస్ఐ, మరియు సిబ్బంది జాన్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ గోరి, వినయ్, రజిత, కానిస్టేబుల్స్ మరియు గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



