.జనం న్యూస్ నవంబర్ 23 వరం ప్రతినిధి గ్రంధి నానాజీరాష్ట్ర సంక్షేమం, దేశ ప్రగతి కోసం అంతర్జాతీయ స్థాయి సమావేశాలలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్డీఏ పార్టీలో సుష్మా స్వరాజ్ స్థాయిలో అంకిత భావతంతో పనిచేస్తున్న శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి పై విమర్శలు హాస్యాస్పదం.. భారతదేశ చరిత్రలో తెలుగువారి కోసం అహర్నిశలు పనిచేసిన, తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన నందమూరి తారకరామారావు ముద్దుల తనయ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురందరేశ్వరి ప్రపంచ దేశాలలో దేశ ఔన్నత్యాన్ని కాపాడే అద్భుతమైన బాధ్యతలతో పని చేస్తున్నారని, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతో గర్వకారణమని ఆ పార్టీ సీనియర్ నాయకులు, సేయిల్ కమిటీ మాజీ డైరెక్టర్ నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురందరేశ్వరి పనితీరుపై వాక్యానాలు చేయడం సరికాదన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ర్యాలీగా మెండుగా సమర్థవంతంగా పనిచేసిన ఆమె స్థానిక రాజమండ్రీ పార్లమెంట్ నియోజకవర్గానికి అవసరమైన అన్ని విధాల సేవా సహకారాలు అందిస్తున్నారని వీరన్న చౌదరి అన్నారు. కొంతమంది తమ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు స్పందించే అవసరం లేదన్నారు. జిల్లాలో సీనియర్ బిజెపి నాయకులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఓటమి ప్రభుత్వ సారధ్యంలో ప్రజా సేవ చేస్తున్నారని వీరన్న చౌదరి గుర్తు చేశారు. దేశమంతటా శ్రీమతి పురందేశ్వరి ప్రతిభ పాటవాలను గుర్తించాయని, ప్రజాభిమానాన్ని మెండుగా సాధించిన ఆమెకు కూటమీ ప్రభుత్వం ఎన్నో బాధ్యతలను అప్పగించిందని ఆయన తెలియజేశారు.


