Listen to this article

నాతి సత్యనారాయణతోనే. పార్టీ కార్యక్రమాలు రచ్చబండలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ

.జనం న్యూస్ నవంబర్ 20, ముమ్మిడివరం నియోజకవర్గం

.కాట్రేనికోన మండలం .వైసీపీ నాయకులు,కార్యకర్తలు గ్రామకమిటీ అందరూ పల్లంకుర్రు మాజీ సర్పంచ్ నాతి సత్యనారాయణ యెలుబడిలో పార్టీ కార్యక్రమాలకు హాజరుకవాలని, అయన నేతృత్వంలోనే పనిచేయాలని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత వైసీపీ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. బుధవారం పల్లంకుర్రు సర్పంచ్ నాతి అలివేణి నివాసం వద్ద వై ఎస్ ఆర్ సిపి తలపెట్టిన కోటిసంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమానికి ముమ్మిడివరంమాజీ శాసనసభ్యులు ముఖ్యఅతిధిగా హాజరైన పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ పనిచేసిన ఉపేక్షించేదిలేదని అన్నారు. పల్లంకుర్రు వైసిపిలో ఉన్న ప్రతిఒక్కరు నాతి సత్యనారాయణ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు చేయాలనీ అన్నారు. ఇప్పటికే పార్టీ అదేసించిన కోటిసంతకాల పల్లంకుర్రులో అద్భుతంగా చేసారాని మాజీ ఎమ్మెల్యే పల్లంకుర్రు వైసీపీ కేడర్ ను ప్రశంసలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, కూటమి ప్రభుత్వం ప్రయివేటు రంగానికి కట్టిబేట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం గ్రామ కమిటీ ఎన్నికల్లో వైసిపి గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడిగా నాతి సత్యనారాయణ ఎంపిక చేశారు. నిన్నటి వరకు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులుగా సేవలందించిన నాతి సత్యనారాయణను సత్యనారాయణ సతీమణి నాతి అలివేణి కి ఇచ్చారు. గ్రామకమిటీ సత్యనారాయణ కు ఇవ్వడం పట్ల పల్లంకుర్రు వైసిపి క్యాడర్ పొన్నాడ సతీష్ కుమార్ చాతుర్యం పట్ల తొలగించి,హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు నల్లా నరసింహామూర్తి, రాష్ట్ర సీఈసీ సభ్యులు కాశి ముని కుమారి, రాష్ట్ర సెంట్రల్ కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, రాష్ట్ర కమిటీ నాయకులు పి చిట్టిరాజు, రాష్ట్ర నాయకులు పెయ్యిల చిట్టిబాబు, రాష్ట్ర నాయకులు వల్లభూని దొరబాబు, మండల అబ్జర్వర్ ఢిల్లీ నారాయణ, రాష్ట్ర నాయకులు ఏడిద సుబ్బు, కాట్రేనికోన జెడ్పిటిసి నేల కిషోర్, మండల ఎంపిపి కొల్లాటి సత్యం, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు మోకా రవికుమార్, ముమ్మిడి వరం నగరపంచాయతి చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, కందికుప్ప సర్పంచ్ చల్లగల అప్పారావు, పల్లం సర్పంచ్ మల్లాడి వీరబాబి, వివిధ గ్రామాల యంపిటిసిలు, సర్పంచ్లు, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు.