జనం న్యూస్ నవంబర్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
దివంగత నేత మాధవరం పద్మారావు కుమారుడు మాధవరం శ్రీనాథ్ రావు అందజేత…
కూకట్ పల్లి వివేకానంద నగర్ కాలనీలో నిర్మాణం లో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత అన్నపూర్ణేశ్వరి దేవి నూతన ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి వాస్తవ్యులు దివంగత మాధవరం పద్మారావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మాధవరం శ్రీనాథ్ రావు నూతన ఆలయ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను చెక్కు రూపంలో ఆలయ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ దైవ సేవలో భాగస్వామ్యం కావడం గొప్ప పుణ్యమనీ మాధవరం శ్రీనాథ్ కుటుంబం చేసిన ఈ మహత్తర విరాళం ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనీ భక్తుల సహకారంతో దేవాలయాన్ని మరింత వైభవంగా రూపుదిద్దే దిశగా కృషి కొనసాగిస్తున్నాం అని అన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు సాఫల్యంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు రాజేశ్వరరావు.


