జనం న్యూస్:- సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక వివాహ వేడుకకు సంబంధించినది. పెళ్లి వీడియో అనగానే సంతోషాలు, సందడి ఉంటుందని అందరూ అనుకుంటారు.. కానీ, ఇదో భయానక వీడియో. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసేందుకు వచ్చిన ఇద్దరు మహిళా డ్యాన్సర్లపై వరుడి బంధువులు కొంతమంది దాడికి యత్నించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ మహిళా డ్యాన్స్‌ర్ పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… హర్యానాలోని నుహ్ జిల్లా మేవాట్ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో డబ్బులు ఇవ్వబోతూ వరుడి తండ్రి ఒక మహిళా డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడు. దీంతో ఆగ్రహించిన డ్యాన్సర్ వరుడి తండ్రి చెంప పగలగొట్టింది. వరుడి బంధువులు దాడికి దిగడంతో డ్యాన్సర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహ వేడుకలో చెలరేగిన గొడవ ఇప్పుడు ఇంటర్ నెట్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆదివారం రాత్రి పెళ్లి మూహూర్తం. కాగా, పెళ్లికి ముందు జరిగిన పార్టీలో నిర్వహించిన డ్యాన్స్ కార్యక్రమంలో గందరగోళం చెలరేగింది. తాగిన మత్తులో స్టేజ్‌పైకి వెళ్లిన ఒక వ్యక్తి మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో చిర్రెత్తిపోయిన ఆ డ్యాన్సర్ అతనికి తగిన బుద్ధి చెప్పింది. ముఖం పగిలిపోయేలా చెంపలు వాయించింది. అది చూసిన పెళ్లివారు ఆగ్రహంతో మండిపోయారు. వెంటనే పెద్ద గుంపు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్సర్లపై దాడికి దిగారు. వరుడి బంధువులు దాడికి దిగడంతో డ్యాన్సర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరకు కొంతమంది యువకులు లేడీ డ్యాన్సర్లను రక్షించి వారిని బయటకు లాగగలిగారు. ఈ మొత్తం సంఘటనను అక్కడే ఉన్న కొంతమంది తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన తర్వాత చాలా మంది ప్రజలు డ్యాన్సర్లకు మద్దతుగా నిలిచారు.


