Listen to this article

జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా

విద్యార్థుల్లో దాగివున్న కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ను వెలికితీయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బాలల వైజ్ఞానిక ప్రదర్శన లో రామచంద్రపురంలోని ఠాగూరు కాన్వెంట్ హై స్కూల్ కు చెందిన 6వ తరగతి చదువుతున్న గణేష్ చేసిన ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల విద్యార్థులను, ఉపాధ్యాయులను శాలువా తో సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు బట్టి చదువు పక్కన పెట్టి.. ఇన్నోవేషన్స్ తో విషయాలను తెలుసుకోవాలని, ఇలా అయితే ఆ సబ్జెక్టుతో పూర్తి పట్టు సాధించవచ్చని తెలిపారు. దీంతో కొత్త విషయాలు కూడా తెలుస్తాయన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ప్రిన్సిపాల్ నాగ రమేష్, ఉపాధ్యాయులు శ్రవణ్, స్రవంతి తదితరులు ఉన్నారు.