Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్.

జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు ఐదు రోజులు జైలుశిక్ష విధిస్తూ అదనవు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎన్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి గారు నవంబరు 20న శిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.వివరాల్లోకి వెళ్తా… విజయనగరం ట్రాఫిక్ సిఐ సిహెచ్. సూరి నాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు విజయనగరం పట్టణంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి, మద్యం సేవించి, వాహనాలు నడిపిన (1) డి.ఉమాశంకరరావు (2) కింతలి ప్రసాదరావు అనే విజయనగరం పట్టణంకు చెందిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా, వారిపై ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, నవంబరు 20న అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎన్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి వద్ద హాజరుపర్చగా, సాక్ష్యాలను పరిశీలించి, నిందితులు ఇరువురు డ్రంకన్ డ్రైవ్ చేసినట్లు గా నిర్ధారించి, ఇరువురికి ఐదు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పును నవంబరు 20న వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. మెజిస్ట్రేట్ వారు ఇచ్చిన ఉత్తర్వులు మేరకు నిందితులను విజయనగరం సబ్ జైలుకు ట్రాఫిక్ పోలీసులు తరలించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నందున ఈ తరహా నేరాన్ని తీవ్రంగా పరిగణించి, నిందితులకు జైలుశిక్ష విధించే విధంగా చర్యలు చేవడుతున్నామన్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు.