జనం న్యూస్ నవంబర్ 21:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలో అక్రమ ఇసుక రవాణా నిరోధించుటకు గాను, గురువారం రాత్రి రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది బట్టాపూర్ గ్రామంలో తిరుగుచుండగా రూపాల బండ ప్రాంతంలో (14) ట్రాక్టర్ల అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపును గుర్తించి సీజ్ చేశారు.ఇట్టి సీజ్ చేసిన (14) ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం రోజునా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేశారు.తహశీల్దార్ మల్లయ్య మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేసినట్లయితే, వాహనాలు సీజ్ చేసి, వాహనాలఓనర్లు మరియు డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


