జనం న్యూస్- నవంబర్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత సమాచార హక్కు చట్టంకే దక్కిందని పార్లమెంటు చేసిన చట్టాల్లో అదొక మైలు రాయిగా నిలిచిపోయిందని అవినీతి నిర్మూలన విధుల్లో బాధ్యత రాహిత్యాన్ని తగ్గించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడం సుపరిపాలనను అందించడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యమని సమాచార హక్కు చట్టం, మానవ హక్కుల లా సమితి కోశాధికారి గొట్టిముక్కల శివశంకరాచారి తెలిపారు. వివిధ స్థాయిలో జరిగే అవినీతిని బయట పెట్టడం జవాబుదారీతనాన్ని పెంచడం అభివృద్ధి సంక్షేమాలను తెలుసుకోవడం ప్రభుత్వ రికార్డుల తనిఖీ అనేది సమాచార హక్కు ఆర్టిఐ సామాన్యులకు కల్పించిన ఒక ప్రధాన అస్త్రం అని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ పరిధిలో అటవీ శాఖ అధికారులు గతంలో కోతుల బెడద గురించి ఇచ్చిన వినతి పత్రం మరియు ఫారెస్ట్ చెక్ పోస్ట్ పెట్టి వసూలు చేసిన నిధుల వివరాలు గురించి సమాచారం ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.మన దేశంలో సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని దేశ పౌరులు అందరు ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తుందని ఇందుకు సంబంధించిన అన్ని నియమాలను చట్టం నిర్వచించిందని, పౌరులు తాము కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు కొన్ని సందర్భాల్లో 48 గంటల్లోపు అందించాలని చట్టం చెబుతుందని ఆయన తెలిపారు, ప్రజలందరూ బాధ్యతాయుతంగా తమకు రాజ్యాంగం కల్పించినటువంటి సమాచార హక్కు చట్టం ద్వారా తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.


