జనం న్యూస్ నంబరు 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
వేట వృత్తిపై ఆధారపడి జీవించే గంగ పుత్రులను ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు శుక్రవారం కాట్రేనికోన మండలం చిర్ర యానం గ్రామంలో మత్స్యకార మహిళల నడపబడుతున్న నాచును జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. రంగురంగుల చేపల పెంపకం, నాచుపెంపకం మొదలైన వ్యాపారాలు వల్ల మత్స్యకార యువత ఆర్థికంగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.మత్స్యకార మహిళలచే ఏర్పాటు చేయబడిన సముద్రపు నాచు ( సీడ్) ను కలెక్టర్ దాట్ల సుబ్బరాజు కలిసి విడుదల చేశారు.అలాగే చిర్రయానం సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన సముద్ర నాచు ర్యాప్తు లను కలెక్టర్,ఎమ్మెల్యేకలిసి ప్రారంభించారు.తరువాత తుపాను షెల్టర్లో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్, ఎమ్మెల్యేలు సముద్రపు నాచు పెంపకం, పీతల పెంపకం, రంగు చేపల పెంపకం వంటి సరికొత్త ఉపాధి అవకాశాలపై విలువైన సూచనలు ఇచ్చారు.దాట్ల సుబ్బరాజు తీర ప్రాంత మహిళలు, యువత, మత్స్యకార సమూహాలు ఈ వినూత్న పథకాలను సద్వినియోగం చేసుకొని అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రోత్సహించారు.మత్స్యశాఖ, డి ఆర్ డి ఏ,, జి సి ఎఫ్ సంయుక్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల ద్వారా కోనసీమ తీర ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి మరింత బలపడుతుందని పేర్కొన్నారు.తదుపరి లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేసి, మత్స్యకారులనుసన్మానించారు.



