మన ప్రజా ప్రతినిధి తెలుగు దిన పత్రిక మెదక్ జిల్లా చేగుంట నవంబర్ 21,
వార్షిక తనిఖీల్లో భాగంగా తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ శుక్రవారం చేగుంట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా స్టేషన్ కి వచ్చిన డిఎస్పీని, రామయంపేట్ సిఐ, వెంకట్ రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి పూలే బొకేతో స్వాగతం చెప్పారు, అనంతరం ఎస్సై ఆధ్వర్యంలో పరేడ్ ను స్వీకరించారు.అనంతరం స్టేషన్లో ఉన్న పలు రికార్డులు, ఆయుధ సంపత్తిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లో నమోదైన కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆదేశించారు, ప్రతి ఒక్కరూ ఫ్రెండ్లీ పోలీసు విధానం కలిగి ఉండాలని, విధినిర్వహణలో,అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందింస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు,. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ స్టేషన్ రికార్డులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకట్ రాజా గౌడ్, ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎస్ ఐ 2,బిక్య నాయక్,ఏ ఎస్ ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


