Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

యునైటెడ్ కింగ్‌డమ్‌ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారతదేశ ఔన్నత్యం,అభివృద్ధి దిశ, ప్రపంచ శాంతి తత్వంపై రాజంపేట బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ఆభిమాన పూర్వకంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే దశాబ్దాల్లో వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ముఖ్యంగా వసుధైవ కుటుంబo అనే భారతీయ సంస్కృత మూల సూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ దేశాలు పరస్పరం శాంతి, సౌహార్దత తో ముందుకు సాగాలని ప్రధాని మోడీ విజన్ ఉందని తెలిపారు.ప్రస్తుతం భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగి వాణిజ్య పరంగా,మానవతా పరంగా,అభివృద్ధి తత్వాల పరంగా ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని వివరించారు.భారతదేశం భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నింటి లోనూ ప్రథమ స్థానాన్ని సాధించే శక్తి ఉన్నదనిధృవీకరించారు.అలాగే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నదని, బీజేపీ ప్రభుత్వంలో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాలు భారతదేశాన్ని వేగంగా పురోగమించే దిశగా నడిపిస్తున్నాయని వివరించారు.భారత్ ప్రపంచానికి ఇవ్వబోయే మార్గ దర్శకత,శాంతి సందేశం, ఆర్థిక శక్తి,రాజకీయ స్థిరత్వం గురించి ఆయన చేసిన విశ్లేషణకు సభలో హాజరైన వారి ప్రశంసలు లభించాయి.