జనం న్యూస్, నవంబర్ 21,ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ).
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల కేంద్రంలోని, కేతకి సంగమేశ్వర స్వామి హుండీ ఆదాయాన్ని, శుక్రవారం లెక్కించారు. గత 85 రోజులకు గాను, స్వామి వారి ఆదాయం,రూపాయలు 33 లక్షల 66 వేల 477 రూపాయలు, కానుకల రూపంలో వచ్చాయి. ఈట్టి హుండీ లెక్కింపు కార్యక్రమంలో, పర్యవేక్షకులు రంగారావు, చైర్మన్ చంద్రశేఖర్, ఆలయ ఈవో శివ రుద్రప్ప, ధర్మకర్తలు, మల్లయ్య స్వామి, శివకుమార్, నవాజ్ రెడ్డి, మల్లప్ప, బసయ్య స్వామి, ఆలయ సిబ్బంది, మరియు, ఝరాసంగం ఎస్సై. పాటిల్ క్రాంతి కుమార్, మరియు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


