జనం న్యూస్ నవంబర్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సాక్షాలు జరిపేసిన వారించలేదని విధి నిర్వహణలో నిర్లక్ష్యం కేసు దర్యాప్తు కూడా సక్రమంగా చెయ్యలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందుల సిఐ శంకరయ్యపై పోలీస్ శాఖ, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాకపోవడంతో డిఐజి ప్రవీణ్ కోయ ప్రవీణ్ సర్వీస్ నుంచి తొలగించడం పోలీసు సర్వీస్ నుంచి తొలగించడం హర్షనీయమని మాజీ శాసన మండల సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగ జగదీశ్వరరావు అన్నారు. నాడు హత్య స్థలములో జగన్ రెడ్డి అనుచరులు రక్తపు మరకలు శుభ్రం చేస్తున్న సాక్షాధారాలు జరిపేస్తున్న అక్కడే ఉన్న శంకరయ్య నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించాడని, అక్కడ జరిగిన సంఘటన అడ్డుకోకుండా సహకరించారని దోషులకు సహకారం అందించారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో పలుమార్లు ప్రస్తావించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లోనూ, కలెక్టర్లు ఎస్పీలు సదస్సులోనూ శాంతి భద్రతలపై సమీక్ష చేస్తున్న సమయంలో వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావించారని, ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని, సెప్టెంబర్ 18న సీఐ శంకరయ్య ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపడం వెనుక జగన్ రెడ్డి కుట్రలు స్పష్టంగా కనబడుతున్నాయని నాగ జగదీష్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హత్యని మసి పూసి మారేడుచేయడం, దోషులతో కలిసి చేతులు కలిపి సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పత్రికలకు ఎక్కడo ఏనాడు పోలీస్ డిపార్ట్మెంట్లో చూడలేదని, ఇది పోలీసు శాఖకు మాయని మచ్చల అనిపించిన పోలీస్ శాఖ సరైన చర్య సిఐ శంకరయ్య పై తీసుకున్నారని అతన్నే డిస్మిస్ చేయడంపై ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు సర్వత్ర హర్షం ప్రకటిస్తున్నారని నాగ జగదీష్ అన్నారు.


