(జనం న్యూస్ 22నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
మంచిర్యాలజిల్లా భీమారం మండల పరిధిలో శుక్రవారం రోజున నిర్వహించిన వన్యప్రాణ సంరక్షణ సదస్సుకు వచ్చిన రైతులు, అడవి పందుల దాడులతో పంటలు విస్తారంగా నాశనం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అడవి పందులు రాత్రికి రాత్రే మా పొలాల్లోకి దూసుకొచ్చి పంటలను పాడుచేస్తున్నాయి. ఒక సీజన్ మొత్తం చేసిన శ్రమ ఒక్క రాత్రిలో నష్టమవుతోంది” అని వాపోయారు. వరి, పంటలకు అత్యధిక నష్టం జరుగుతోందని వివరించారు.రైతుల ప్రధాన ఆరోపణ, పంట నష్టం జరిగిన తర్వాత పరిహారం అందడంలో ఆలస్యం. నష్టం అంచనా వేయడానికి అధికారులు గ్రామాలకు రావడం వేగంగా జరగకపోవడంతో, రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు.వన్యప్రాణాల సంరక్షణ అవసరాన్ని అంగీకరించిన రైతులు, “సంరక్షణ సరే… కానీ మా పంటల రక్షణ కూడా ముఖ్యమే” అని స్పష్టం చేశారు.వారి సమస్యలను విన్న వన్యప్రాణ శాఖ అధికారులు మాట్లాడుతూ,అడవి పందుల సంచారాన్ని గుర్తించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేస్తామని,పంటలను రక్షించేందుకు సౌర ఫెన్సింగ్, శబ్ద పరికరాలు, గుంతలు వంటి రక్షణ చర్యలకు సాంకేతిక సహాయం అందిస్తామని,
నష్టపరిహారం ప్రక్రియను త్వరితగతిన చేపట్టేందుకు నూతన మార్గదర్శకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.వన్యప్రాణాల సంరక్షణ–రైతుల రక్షణ రెండింటి మధ్య సమతుల్యత తప్పనిసరి అని సూచించారు.
సదస్సు ముగిసే సరికి, అధికారులు. పంట నష్టాన్ని తగ్గించడంలో అధికారులు–రైతులు కలిసి పనిచేయడం అవసరమని నిపుణులు అభిప్రాయపడరు



