Listen to this article

జనం న్యూస్ నవంబర్ 22 ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలం లో 24-11-2025 నుండి 29-11-2025 సోమవారం నుండి ప్రతి గ్రామంలో “రైతన్న-మీ కోసం”కార్యక్రమం జరుగుతుంది. గ్రామ వ్యవసాయ సహాయకులు (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) టీమ్ లీడరుగా వి ఆర్ ఓ,పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అభ్యుదయ రైతులు టీముగా ప్రతి (3 రైతు కుటుంబాలు ఒక క్లస్టర్) రైతు కుటుంబాన్ని సందర్శించి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన 5 సూత్రాలను రైతులకు వివరించడం జరుగుతుంది.వర్షపు నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవాలి. సూక్ష్మ నీటి సేద్యం 100% సబ్సిడీ పై పరికరాలు ఉపయోగించుకోమని తెలియజేస్తారు.అంతర పంటల సాగును, మిల్లెట్స్ సాగును చేపట్టాలని, సేంద్రీయ వ్యవసాయ పద్దతులను అవలంబించాలని తెలియజేస్తారు.వ్యవసాయంలో ఆధునిక పద్దతులను అవలంబించాలని వ్యవసాయ పరికరాలు డ్రోన్ ద్వారా పిచికారీ భూసార పరీక్షలు తెగుళ్ల స్థితిగతులను ముందుగా అంచనా వేయుట గురించి తెలియజేస్తారు.మన ప్రాంతంలో పంటలను నిల్వచేసుకోవటానికి ప్యాక్ హౌస్ లు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టుకోమని తెలియజేస్తారు.ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలుగా కరువు మండలాలను, పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ, ప్రొక్యూర్మెంట్, పంట నష్ట పరిహారం, పి యమ్ కిసాన్ – అన్నదాత సుఖీభవ ఆదుకొంటుందని తెలియజేస్తారు. ప్రతి కుటుంబంలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారికీ ఏ పి ఏ ఐ ఎం ఎస్ యాప్ ద్వారా వ్యవసాయానికి అవసరమైన టెక్నాలజీని రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి బి.మల్లికా ప్రకటన లో తెలిపారు.