జనం న్యూస్ నవంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్టులో మొదటి స్థానంలో నిలిచి జిల్లా స్థాయికి సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాల విద్యార్థులు రుత్వీక, హస్మిత ప్రజ్వల్ కుమార్ అర్హతను సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి బిక్షపతి పాల్గొని విద్యార్థుల్ని అభినందించి, జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో మంచి ప్రతిభను కనపరచి మండలానికి మీ పాఠశాలకు మంచి పేరు తేవాలని అభినందనలు తెలియజేసి ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి. అనిల్ కుమార్ పాఠశాల స్టాఫ్ సెక్రటరీ డి. రాజన్న పాల్గొన్నారు.


