జనం న్యూస్- నవంబర్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో సమస్త కార్యదర్శి సైదులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి 100కు పైగా మొక్కలను నాటారు. ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించడం కోసం జన్మదినం రోజున చాక్లెట్లు పంచటం కన్నా మొక్కలను పెంచడంతో మనకు పర్యావరణానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో మొక్కలు పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ సంతోష్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కృష్ణ శ్రీరాముడు, నాగరాజు, పాఠశాల కళాశాల పీడీలు జ్యోతి, అరుణ, పీఈటి నరసింహ, జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.


