పయనించే సూర్యుడు నవంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కూటమి ప్రభుత్వం కల్లు తెరవాలని, మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, విద్యార్థుల భవిషత్తుతో చెలగాటం ఆడవద్దని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రె డ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని 17, 18,19, 20 వార్డులలో వున్నా విశ్వనగర్, ఎన్జీఓ కాలనీ, పొన్నాపురం, ఏకలవ్య నగర్ ప్రాంతంలో నేడు మాజీ ఎమ్మెల్యే శిల్సా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల వద్ద నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జికూటివ్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిర్ అమీర్, మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు, వైసీపీ నాయకులు శ్రీరాములు, మానిపాటి ఆంజనేయులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, జిల్లా అధికార ప్రతినిధి అనీల్ అమృత రాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాసులు, సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, డీలర్ లు జనార్థన్, మోహన్ రెడ్డి, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థుల బంగార్లు భవిషత్తును నాశనం చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగంగా రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మాజీ మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తొలి దశలో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించారని తెలిపారు. నంద్యాల మెడికల్ కళాశాల ప్రథమ సంవత్సరం చదివిన విద్యార్థిక స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందన్నారు. ఇటీవల నంద్యాల మెడికల్ కళాశాల ప్రెషర్స్ డే వేడుకలకు టీడీపీ నేతలు రావడం జరిగిందని, అయితే ఆ పార్టీ హోంశాఖ మంత్రి వంగల పూడి అనిత మెడికల్ కళాశాలలే లేవని అసత్యపు, అబద్దపు మాటలు మాట్లాడటం ప్రజలు గ్రహించాలన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చే శారు. ప్రజలు తాము చేస్తున్న ప్రజా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.


