Listen to this article

జనం న్యూస్‌ 23 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

నగర పాలక కమిషనర్‌ నల్లనయ్య

జర్నలిస్టు లకు ఎప్పుడూ తమ వంతు సహకారం

సమాచార శాఖ ఎడి గోవింద రావు

ఘనంగా ఎపి యూ డబ్యూ జే కార్తీక వన మహెోళత్సవం….ప్రజావాణిని నిర్భయంగా వెలుగెత్తి చాటే పవిత్రమైన వృత్తి పాత్రికేయానిదేనని విజయన గరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనమహోూత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల వృత్తి సమాజంలో వారి పాత్రను ప్రస్ఫుటపరిచే విధంగా అక్షర రూపాన్ని రూపొందించి స్వీయ రూపకల్పన చేసి చక్కటి పాటను రచించిన కమిషనర్ పల్లి నల్లనయ్య పాత్రికేయులకు అంకితం చేశారు. విలేకరుల వృత్తి ధర్మాన్ని వివరిస్తూ రూపొందిం చిన గీతం అబ్బురపరిచిందని పలువురు ప్రశం సలు కురిపించారు. అనంతరం ఏపీయూ | డబ్ల్యూజే కార్యవర్గాన్ని ఆయన ఉచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరే పాత్రికేయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్లే అరుదైన అవకాశం విలేఖరులకే ఉందని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే పాత్రికేయ వృత్తి ఉత్కృష్టమైనదిగా అభివర్ణించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని రానున్న రోజుల్లో మరిన్ని సరికొత్త ఆవిష్కరణలకు నాంది ప్రస్థానం కొనసాగించాలని అభిభాషించారు. సమాజ సేవలో పాత్రికేయులు చొరవ చూపడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఏర్పాటైన సందర్భంగా పదివేల రూపాయల అందజేయనున్నట్లు వెల్లడించారు. అందరూ సమిష్టిగా కృషిచేసి సమాజ హితానికి బాటలు వేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. సమాచార శాఖ ఎడి గోవిందరావు మాట్లాడుతూ జర్నలిస్టు ల కు ఎప్పుడూ తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు దిమిలి అచ్యుతరావు, శివప్రసాద్, సురేష్, మహా పాత్రో పంచాది అప్పారావు, డేవిడ్, పాత్రో, నర్సింగ్ రావు, ఎం ఎస్ ఎన్ రాజు, శర్మ, రాధ కృష్ణ, గాంధీ, యుగంధర్, లక్ష్మణ రావు పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.