జనం న్యూస్ 23 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభసభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు చేసిన ఆయన బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా అది జరగలేదు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆయన ఆదివారం శ్రీకాకుళంలో జరిగే రెడ్డిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారోనన్న ఆసక్తి నెలకొంది.


