జనం న్యూస్ 23 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన పైన అవగాహన సదస్సు కు హాజరై. బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్, పీయు ఇంచార్జి కురువ పల్లయ్య
యూనివర్సిటీలో జరిగిన ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై బీసీ రిజర్వేషన్ల సాధన పై విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన డాక్టర్ విశారదన్ మహరాజ్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఈ దేశంలో బీసీ లకు ముందుగా జ్ఞానంతో కూడిన జ్ఞానోదయం కలగాలి అయితేనే ఈ బీసీ రాజ్యం వస్తుంది. బీసీలకు రిజర్వేషన్ల చట్టం అమలు అయి 9వ షెడ్యూల్ లో చేర్చినప్పుడే ఈ దేశం గణతంత్ర దేశం గా వికసితుంది. బీసీ లలో పరివర్తన జరగాలి. తెలంగాణ ఉద్యమం దేనికోసమైతే ప్రారంభమైందో అట్లనే బిసి ఉద్యమం ప్రారంభమైతే తప్ప ఈ ప్రభుత్వాలు మనకు రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు అట్లా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు రిజర్వేషన్లు దానంతట అవే వస్తాయి అని అన్నారు. ఈ దేశంలో అంబేద్కర్ ఫూలే ఐడియాలజిని ఆహారంగా భూజించాలి. అప్పుడే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 90% రిజర్వేషన్లు అమలు అయితేనే అన్నిట్లో సమాన వాట మనకు దక్కుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


