తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 24
.రోజు బాచుపల్లిలో ప్రగతి నగర్ శ్రీ నిధి గ్లోబల్ స్కూల్ లో ఏకోస్ అఫ్ ఎక్స్ప్రెషన్ ప్రోగ్రాం ఛైర్మెన్ Dr.నల్లపాటి వెంకటేశ్వర రావు, ప్రెసిడెంట్ నల్లపాటి రాజేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ సాయి నాథ్ నాయుడు ,వారి యొక్క ప్రొత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ముందుగా ప్రిన్సిపల్ షాలిని చౌరభ్ చాగంటి అకాడమిక్ మేనేజర్ ఎట్ రత్న సాగర్ మరియు శరత్ కుమార్ ఎకాడెమిక్ డైరెక్టర్ శ్రీ నిధి గ్రూప్ స్కూల్ వీరు జ్యోతి ప్రజ్వలన చేశారు . ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాఠశాల అంటే కేవలం చదువు భోదించే ఉపాధ్యాయులే కాదు అది ప్రతి విద్యార్థి వ్యక్తిత్వాన్ని ,ఆలోచనా శైలిని ,నైతిక విలువలను వారి భవిష్యత్తు నిర్మించే పాఠశాల శ్రీ నిధి గ్లోబల్ స్కూల్ అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు .విద్యార్థులకు ఇంగ్లీష్ భాష పట్ల అవగాహన కల్పించారు .ఏకోస్ అఫ్ ఎక్స్ప్రెషన్ అనే స్లోగన్ తో ఫీల్ ఇట్ ,ఫ్రేమ్ ఇట్ అండ్ ఎక్ష్ప్రెస్స్ ఇట్ అనే అంశాలలో పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అవగాహన్ కల్పించారు .ఇందులో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ వారి లక్ష్యాలను చెరుకునేలా మోటివేట్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రాం లో ఏ జర్నీ అఫ్ ఇంగ్లీష్ , ఫోనిక్స్ గాలక్సీ ,గ్రామర్ గార్డెన్, న్యూస్ స్టూడియో ,రోల్ ప్లేస్ మరియు డ్రామా వంటి వాటి గురించి విద్యార్థిని విద్యార్థులు చక్కగా వివరించారు.ఈ యొక్క కార్యక్రమానికి వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ,చౌరభ్ చాగంటి అకాడమిక్ మేనేజర్ ఎట్ రత్న సాగర్ మరియు శరత్ కుమార్ ఎకాడెమిక్ డైరెక్టర్ మరియ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ,విద్యార్థి విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు




