Listen to this article

జనం న్యూస్ నవంబర్ 24:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల

మండల కేంద్రములో సోమవారం రోజునా కేజీబీవి స్కూల్ లో మరమ్మతులు, రిపేర్ పనులు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకంలోభాగముగా 11లక్షల నిధుల పనులకు భూమి పూజా కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కమిటీ క్యాసియర్ జుంగల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవారెడ్డి, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగాజిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ కేజీబీవీ స్కూల్ లో సమస్యల మరమత్తులకు నిధులు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు ధనసరి సీతక్క దృష్టికి తీసుకపోవడంతో ఇట్టి నిధులు మంజూరు ఇప్పించడంతో గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.అట్లాగే అందరూ తోటలోని ప్రైమరీ స్కూల్ కు కూడా రిపేర్ గురించి భవిత పథకం ద్వారా 3 లక్షలు మంజూరు కావడం జరిగింది. అది కూడా త్వరలో పనులు ప్రారంభంకావడం జరుగుతుంది అని శివకుమార్ తెలిపారు. ఇట్టి కార్యక్రమములో ముస్కు మోహన్, గడ్డం జీవన్, కూరాకుల బొర్రన్న, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, దండేవోయిన సాయన్న, సుధానవేణి శ్రీనివాస్ గౌడ్ , దండేవోయిన సాయి, మదస్తూ చిన్న గంగారాం, సున్నపు గణపతి, సంఘం గంగాధర్, ఇబ్రహీంపట్నం చిన్న గంగాధర్, గఫూర్, సలీం, రాము, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు .