Listen to this article

జనం న్యూస్‌ 25 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతిరాజు జన్మదినోత్సవ వేడుకులు ఘనంగా జరిగాయి. గతానికి భిన్నంగా నియోజకవర్గ స్థాయిలో ఈ వేడుకులు కొనసాగాయి. అశోక్‌ బంగ్లాలో నియోజకవర్గం పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన ఈ వేడుకుల్లో డివిజన్లు, గ్రామాల వారీగా నాయకులు పాల్గొన్నారు. అధితితో కేక్‌ కట్‌ చేయించారు. కొంత మంది పుష్ప స్మా ఇచ్చి శు భాకాంక్షలు తెలియజేశారు. సింహాచలం, రామతీర్థం, పైడితల్లి అమ్మువారి దేవస్థానం వేద పండితులు తొలుత తమ ఆశ్వీరచనాలను ఆమెకు అందించారు. అనంతరం డివిజన్లు వారీగా నాయకులు పూల దండాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.వేడుకులు అనంతరం పలు సేవా కార్యక్రమాలలో తమె పాల్గొన్నారు. పేర్ల వారి మూగ, చెవిటి పాఠశాలకు ఆమె వెళ్లారు.విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు ఇచ్చిన లక్షా 84 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. అలానే, ప్రేమ సమాజంలో వృద్ధులు, వితంతవులు ఆమె పరామర్శించారు. వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆ ఆశ్రమానికి 25 స్టూల్స్‌ ని అందజేశారు. అలానే ఫైర్‌ ఆఫీస్‌ వద్ద గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహానికి చేరుకుని 25 దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పినవేమలి గ్రామంలో ఉన్న ఏబీసీ వృద్ధాశ్రమంలో వారికి పండ్లు, స్వీట్స్‌, భోజనాన్ని పార్టీ నాయకుల ఏర్పాటు చేశారు. అదేవిధంగా వి.టీ.అగ్రహారం బాలికల వనతి గృహంలో పార్టీ నాయకుల నహకారంతో 45 వేల రూపాయలతో _ విలువైన 100 లీటర్ల సామర్ధ్యం కలిగిన అర్‌.ఓ.
వాటర్‌ ప్లాంట్‌ ను ఆమె ప్రారంభించారు. అలానే, జనసేన నాయకులు అవనాపు విక్రమ్‌ ఆమెకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గంటా రవి, బొద్దుల నర్సింగరావు, అవనావు విజయ్‌, గాడు అప్పారావు, ఐవిపిరాజు, బలివాడ అప్పారావు, (ప్రసాదుల లక్ష్మీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.