Listen to this article

విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్

జనం న్యూస్‌ 25 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిలు ర్యాలీ పేరుతో సుమారు 1000 కి॥మీ॥ల దూరాన్ని పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ నవంబరు 24న తెలిపారు. 13వ రోజున విజయనగరం పట్టణంలో నిర్వహించిన ‘అభ్యదయం సైకిలు ర్యాలీ’లో విశాఖ డీఐజీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ మాట్లాడుతూ – మాదక ద్రవ్యాల పట్ల యువతకు విద్యార్ధి దశలోనే సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సంకల్పం మిషన్, కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టామన్నారు. విశాఖ పట్నం రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు 19,740 అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ కార్యమాల్లో 11లక్షల 58వేల 870మంది ఇప్పటి వరకు పాల్గొన్నారని, 14,452 గ్రామాలు/పట్టణాల్లో ‘సంకల్పం’ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5,326 విద్యాసంస్థల్లో సంకల్పం కార్యక్రమాలు జరగగా, 4,58,096 మంది విద్యార్థులు కార్యక్రమాలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు, యువతను చైతన్యపర్చేందుకు 1,46,367 కరపత్రాలను పంపిణీ చేసి, ముఖ్యమైన ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద 388 డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేసామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించేందుకు 24,094 ఈగల్ క్లబ్స్ ను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసామని విశాఖపట్నం రేంజ్ డిఐజి తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీసుశాఖ ఒక్కటే చర్యలు చేపడితే సరిపోదని, ఇందుకు సివిల్ సొసైటీలు, ఎన్.జి.ఓ.లు, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ఈ డ్రగ్స్ వలన సమాజం ఏవిధంగా నష్టపోతుంది ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గత 16 మాసాల్లో 2,467 మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేసామని, వీరిలో 87 కేసుల్లో 67 మందికి 10సం.లు కంటే ఎక్కువగా జైలుశిక్ష విధింపబడ్డాయన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఒక్కసారి అరెస్టు అయితే జీవితం నాశనమైనట్టేనన్నారు. డ్రగ్స్ అలవాటు కావడం వలన యువత నేరాలకు పాల్పడుతూ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు. కావున, డ్రగ్స్ ను వినియోగించడం, అమ్మడం, రవాణ చేయడం, కలిగి ఉండకూడదని యుతకు విశాఖపటనం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1972 అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ అన్నారు.
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – గంజాయి, డ్రగ్స్ వినియోగం వలన జీవితం ఏవిధంగా నాశనమవుతుంది, కుటుంబంపై ఎటువంటి చెడు ప్రభావం చూపుతుంది, సమాజంలో ఏవిధమైన చెడ్డ పేరు వస్తుందో ప్రజలు గుర్తించాలన్నారు. యువత తెలిసీ తెలియని వయస్సులో కుతూహలంతో డ్రగ్స్ కు బానిసలవుతున్నారన్నారు. రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీసులు సైకిళ్ళు మీద ప్రయాణించి, యువతను, ప్రజలను చైతన్యపర్చేందుకు ‘అభ్యదయం సైకిలు యాత్ర’ను చేపట్టడం జరిగిందన్నారు. గంజాయి వాడిన, రవాణ చేసిన, కలిగి వున్నా, విక్రయించినా ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించి, వాటికి దూరంగా ఉండాలన్నారు.జాయింట్ కలెక్టరు సేతు మాధవ్ మాట్లాడుతూ – యువతకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను వివరించేందుకు పోలీసుశాఖ ‘అభ్యదయం సైకిలు ర్యాలీ’ ప్రారంభించిందన్నారు. డ్రగ్స్ వినియోగం వలన యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. కావున, ప్రతీ ఒక్కరూ డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను గుర్తించి, జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు.అనంతరం, అభ్యుదయం సైకిలు ర్యాలీలో విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, జాయింట్ కలెక్టరు సేతు మాధవ్ స్వయంగా సైకిలు త్రొక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సైకిలు ర్యాలీలో పోలీసులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఈగల్ టీమ్స్, ఎక్సైజ్ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతకు మాదక ద్రవ్యాల అనర్ధాల పట్ల అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్స్, డాన్స్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సైకిలు ర్యాలీ డెంకాడలోకి ప్రవేసించగా స్థానికులు, డెంకాడ పోలీసులు సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ కీర్తి, ఎక్సైజ్ ఈఎస్ శ్రీనాధ్, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, ఎఆర్ డిఎస్పీ ఈ.కోటి రెడ్డి, పలువురు సీఐలు, ఎస్ఐలు, ఎన్.జి.ఓ.లు, ఈగల్ టీమ్, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్.సి.సి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.