జనం న్యూస్ నవంబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక
మండలం నాగులపల్లి గ్రామంలో జగ్గయ్యపేట అగ్రహారం కోణం గట్టు దరి నివసిస్తున్న శరగడం నాగలక్ష్మి గృహంలో సోమవారం రాత్రి సమయంలో దొంగలు పడి చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే శరగడం నాగలక్ష్మి కు భర్త మరణించారు. ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఉద్యోగరీత్యా కుమారుడు చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. కుమారుడును చూడటానికి తల్లి నాగలక్ష్మి చెన్నై కు వెళ్లారు. ఇదే అదును చూసుకొని దొంగలు రాత్రి చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో గేటుకు వేసిన తాళమును పగలగొట్టి ఇంటిలో ప్రవేశించి రెండు బెడ్ రూములలో ఉన్న బీరువా లను లాకర్లు ను పగలగొట్టి అందులో దాచుకున్న 10 కేజీల వెండి బంగారం నగదు దోచుకుని బట్టలు దస్తావేజులు చింద్రబంధం చేసి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం కూతురు పద్మ, అల్లుడు నాగేంద్ర ఇల్లు శుభ్రం చేయుట కొరకు వచ్చి చూడగా గేటు తాళం పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా రూములో బట్టలు పేపర్లు చల్లా చదురుగా కనిపించడంతో వెంటనే మునగపాక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కేసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు నివసిస్తున్న నివాసం ఊరికి చివరిగా ఉండటం వలన చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ విషయంపై గ్రామ సర్పంచ్ కు ఫిర్యాదు చేశారు.//


