చొరవ చూపిన కాట్రేనికోన సర్పంచ్ గంటి సుధాకర్
జనం న్యూస్ నవంబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
కాట్రేనికోన సర్పంచ్ గుంటూరుకు చెందిన డి బి ఆర్ సి (దళిత బహుజన రిసోర్స్ సెంటర్)క్రిస్టియన్ ఏయిడ్ స్వచ్ఛందసేవాసంస్థల సౌజన్యంతో కాట్రేనికోన గ్రామంలో కూలిపనులు లేక అల్లాడుతున్న నీరుపేద ప్రజలకు మంగళవారం ఆర్థిక సాయం అందించారు.తుఫాన్ దెబ్బకు కూలిపనులు లేకపోవడంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈక్రమంలో కాట్రేనికోన సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ స్వచ్ఛంద సేవా సంస్థల దృష్టికితీసుకెళ్లారు.అయా సంస్థల ప్రతినిధులు కు జరిగిన విపత్తును వివరంగా తెలియచేసారు.సర్పంచ్ సేవా సంస్థల సిబ్బందినీ వెంటపెట్టుకుని పరిస్థితిని చూపించారు. గ్రామప్రజలందరికీ ఆర్థిక సాయం చేసేలా వారిని కోరారు.దీంతో గ్రామంలో జరిగిన విపత్తును పరిశీలించిన స్వచ్ఛంద సేవా సంస్థలు సోమవారం నుండి డిబిటి పద్దతిలో తుఫాన్ బాధితులకు సాయం అందించడం మొదలుపెట్టారు.కాట్రేనికోన పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో డి.బి.ఆర్.సి ఎక్జిక్యూటివ్ సెక్రటరీ అల్లాడి దేవకుమార్ మాట్లాడుతూ సర్పంచ్ సుధాకర్ చొరవతోనే అధికమందికి బాధిత ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు చెందిన పేదవారికి ఆర్ధిక సాయం అందిస్తున్నామని మీడియాకు తెలిపారు.డిబీఆర్సి ధ స్టార్ట్ నెట్వర్క్,క్రిస్టియన్ ఏయిడ్ సహకారం తో డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 2500 మంది పేద ప్రజలకు ఒక్కొక్కరికి రూ.4,500 చెప్పిన అందజేస్తున్నామన్నారు.వీటితో పాటు రగ్గు,నిత్యావసర వస్తువులు,వంటపాత్రలతో కూడిన ఒక్కోటి 6 వేల విలువ చేసే 300 కిట్లను ప్రజలకు అందించామన్నారు.కాట్రేనికోన పంచాయతీ వద్ద లబ్ధిదారులకు కిట్లు అందించారు.ఈసందర్భంగా సర్పంచ్ చొరవను, సేవా గుణాన్ని సంస్థల సిబ్బంది అభినందించారు.భవిష్యత్తు లో ఏదైనా సహాయం చేసే అవకాశం ఉంటే కాట్రెనికోన పంచాయతికి మొదటి ప్రాధాన్యమిస్తామన్నారు.ఇంతటి సాయన్ని తుఫాన్ బాధితులకు అందించిన సంస్థసభ్యుల సర్పంచ్ సుధాకర్ ధన్యవాదములు తెలిపారు.ఈకార్యక్రమంలో సీహెచ్ శామ్యూల్ అనిల్ కుమార్, డా.ప్రవీణ్ కుమార్, డా.హెన్నా, ఏమో . హేమలత, కె.వెంకటేశ్వరరావు స్థానికులు పాల్గొన్నారు.



