జనం న్యూస్ 25 నవంబర్ వికారాబాద్ జిల్లా.
వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని అంగడి చిట్టేంపల్లీ గ్రామంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం- మొక్కజొన్న పరిశోధన విభాగం సంచాలకులు డా. సుజాత గారి బృందం పర్యటించారు. ఈ సందర్భంగా వారు అంగడి చిట్టెంపల్లీ గ్రామాన్ని దత్తత (adopted Village) తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే మూడు సంవ్సరాలపాటు శాస్త్రవేత్తలు సమగ్రంగా అధ్యయనం చేసి వ్యవసాయ రంగం అభవృద్ధికి తోడ్పడతామని తెలిపారు. మట్టి నమూనా పరీక్షలు, యాంత్రీకరణ, సాంకేతకపరమైన మెలకువలు, నికర ఆదాయం పెంచడం వీటి ముఖ్య ఉద్దేశం.ఈ కార్యక్రమంలో 12 మంది రైతులుకు మేలైన రకాల మొక్కజొన్న విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసర్తవేత్తలు డా మల్లయ్య, డా శ్రావణి, మండల వ్యవసాయాధికారి శ్రీ తులసి రామ్, విస్తీర్ణ అధికారి ఎలియాస్, రైతులు రవి, చెన్నయ్య, జంగయ్య, నవాజ్ రెడ్డి, విటలయ్య గార్లు పాల్గొన్నారు.


