Listen to this article

జనం న్యూస్ నవంబర్ 25 కోటబొమ్మాళి మండలం: గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సగం బిల్లులు పడి మిగిలినవి పెండిరగులో ఉన్నాయని వారిని లబ్ధిదారులకు అందించాలని మంగళవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు ఆద్వర్యంలో ఎండీవో కె. ఫణీంద్రకుమార్‌ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులు అడిగారు. ప్రస్తుత ఓటర్‌ లిస్టుల్లో కుటుంబసభ్యులు పేర్లు వరుస క్రమంగా లేవని వాటిని సరిచేయాలని, శ్రీపురం కూరగాయల మార్కెట్‌ వద్ద శితలగిడ్డంగి నిర్మాంచాలని రెవెన్యూ అధికారులు ప్రసాదరావును ఎంపీటీసీ బొడ్డు అప్పన్న కోరారు. ఉపాధిహామీ వేదన దారులు తప్పని సరిగా ఈకెవై చేయించుకోవాలని, ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు కావాలంటే వారికి తప్పని సరిగా జాబు కార్డు తీసుకోవాలని ఉపాధిహామీ ఏపీవో జి. హరిప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దుక్క రోజారామక్రిష్ణ, పీఏసీఎస్‌అద్యక్షురాలు వెలమల కామేశ్వరరావు, సభ్యులు హేమసుందరరాజు, బి. దివాకర్‌, పి. వెంకటరావు, మండల పరిషత్‌ కార్యాలయ ఏవో నారాయణరావు, అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.