జనం న్యూస్ 26 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన నిందితుడు కనపాకకు చెందిన పడగల అజయ్ కు 14 రోజులు జైలుశిక్ష మరియు రూ.10,000 లు జరిమానా విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి గారు నవంబరు 25న శిక్ష విధించినట్లుగా విజయనగరం 1వ పట్టణ సి.ఐ. ఆర్.వి.ఆర్.కే.చౌదరి తెలిపారు.


