Listen to this article

జనం న్యూస్ 26.నవంబర్.కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.

జైనూర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా జంగామ్ హనుమాన్ ఘాట్ వద్దకు జైనూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఘన స్వాగతం పలికారు.సుగుణక్క రాకను పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు డప్పుల వాయిద్యాలు, పుష్పవర్షం, పూలహారాలతో సంప్రదాయబద్ధంగా సన్మానించారు. ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యకర్తల ఉత్సాహం నెలకొంది.హనుమాన్ ఘాట్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అక్కడి నుంచి పార్టీ శ్రేణుల మధ్య భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది బైకులతో సాగిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సుగుణక్క ఓపెన్ టాప్ జీపులో చేతులు జోడిస్తూ కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేశారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సిర్పూర్ (U) మండలం,

పుట్టింటి గ్రామంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకు ఘన స్వాగతం

సిర్పూర్(యు): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకు ఆమె తల్లి గారి స్వగ్రామమైన సిర్పూర్-యు మండలం పుల్లారా పంచాయితీ,భోగడగూడాలో మంగళవారం విశేష స్వాగతం లభించింది. డీసీసీ హోదాలో గ్రామానికి సుగుణక్క మొదటిసారి రావడంతో గ్రామస్తులు టపాసులు పేలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ ఆనందోత్సవాల నడుమ స్వాగతం పలికారు.ఆదివాసీ సంప్రదాయం ప్రకారం డోలు,వాయిద్యాల మధ్య గ్రామ పెద్దలు, మహిళలు, యువత సుగుణక్కను ఘనంగా ఆహ్వానించారు.తన గ్రామ ఆడబిడ్డ అంచెలంచెలుగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, పుట్టింటి పేరు ప్రతిష్ఠలను పెంచాలని గ్రామస్థులు కోరుకున్నారు.సుగుణక్కను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుగుణక్క మాట్లాడుతూ..పుట్టిన ఊరికి వచ్చిన ప్రతిసారీ నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ గ్రామం నాకు ఇచ్చిన ప్రేమ, ఆశీర్వాదాలు నన్ను ఈరోజు ఉన్న స్థాయికి తీసుకువచ్చాయి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పూర్తి స్థాయిలో కృషి చేస్తాను.నా పుట్టింటి గ్రామం పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లడం నా ధ్యేయం. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని తెలిపారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు… ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్.. జైనూర్ మండలం అధ్యక్షులు. షేక్ ముఖిద్.సిర్పూర్ (U) మండల అధ్యక్షులు ఆత్రం శంకర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు మెస్రం గోవింద్ రావ్.పెందోర్ అర్జున్, కనక ప్రతిభ, రాథోడ్ రాందాష్, ఆత్రం జాలిమ్ షా, పంద్రం శెక్కు,మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మన్,మెస్రం అంబాజీ రావ్, మాజీ ఎంపీటీసీ కు కూడ్మేత యశ్వంత్ రావ్,హైమద్ ఖాన్, కార్యకర్తలు గంగారాం,హైధర్, ప్రకాష్, లింగు, గోపిచంద్,అజ్జు లాల, దౌలత్,సంజీవ్, సైబీర్,సుభాష్, ఓసిమ్, కోటేష్,సుద్దాల శ్రీనివాస్,మహేష్, అప్రోచ్,మోతిరాం..శంకర్,ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్