Listen to this article

జనం న్యూస్ నవంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెయ్యరు పంచాయతీ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే ఘనంగా నివాళులు అర్పించారు. పెనుమల్ల గ్రామంలో పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అర్పించారు. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి విశిష్టమైన స్థానం ఉందని మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో నాతి సత్యనారాయణ, గంటి వెంకట సుధాకర్, నల్ల నరసింహమూర్తి ,చీకురు మిల్లి చక్రధర్, మట్ట రమేష్, కుంచె రాజు, వరసాల దుర్గ ప్రసాద్, తదితరులు ఉన్నారు